హైదరాబాద్: 28°C
తెలంగాణ

ట్రాక్టర్ నడిపిన ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి

SRPT: సూర్యపేటలో గణేశ్ నిమజ్జన శోభాయాత్ర అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ యాత్రను ప్రారంభించారు. మొదటి గణపతి వాహనాన్ని స్వయంగా నడిపి ఆయన సందడి చేశారు. కోలాటాలు, కళాకారుల నృత్యాల మధ్య సాగిన ఊరేగింపులో పట్టణ ప్రజలు దారిపొడవునా కొబ్బరికాయలు కొట్టారు.