WGL: నర్సంపేట 25వ డివిజన్‌లో ప్రతిష్టించిన15 అడుగుల భారీ మట్టి వినాయకుడికి బుధవారం భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు. పర్యావరణ పరిరక్షణను కాంక్షిస్తూ ఏర్పాటు చేసిన ఈ భారీ మట్టి గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన శోభాయాత్రలో స్థానిక మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో పాల్గొని, భక్తిశ్రద్ధలతో కోలాటాలు, నృత్యాలు చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు.
తెలంగాణ
VIDEO: 15 అడుగుల మట్టి గణపయ్యకు వీడ్కోలు


