MBNR: జడ్చర్ల పట్టణంలోని బీ.ఆర్.ఆర్ డిగ్రీ కళాశాలలో ఉన్న తెలంగాణ బొటానికల్ గార్డెన్‌ను కొత్తకోట మండలం మోజర్లకు చెందిన హార్టికల్చర్ విద్యార్థులు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా గార్డెన్‌లో ఉన్న మొక్కలను వాటి విశేషాలను వాటి ప్రాముఖ్యతను గార్డెన్ సమన్వయకర్త సదాశివయ్య వివరించారు. అనంతరం అంతరించిపోతున్న మొక్కలను విద్యార్థులకు పరిచయం చేశారు.
తెలంగాణ
బొటానికల్ గార్డెన్ ను సందర్శించిన హార్టికల్చర్ విద్యార్థులు


