ADB: ఉట్నూర్ మండలం నర్సాపూర్ (బి) గ్రామస్తుల 10 ఏళ్ల భూసమస్య కలెక్టర్ రాజర్షి షా చొరవతో పరిష్కారమైంది. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు ఆయన భూమి పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దీర్ఘకాలిక సమస్యను తీర్చినందుకు గ్రామస్తులు కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పంపిణీ కార్యక్రమంలో పలువురు రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ
కలెక్టర్ చొరవతో పదేళ్ల సమస్యకు పరిష్కారం


