హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పాత కక్షలతో దాడి.. ఇద్దరికి గాయాలు

కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పెద్దఅవుటుపల్లిలో వినాయక ఊరేగింపులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పాత కక్షలు, కుల విభేదాల నేపథ్యంలో జరిగిన ఘర్షణలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. నిందితులు కుల దూషణలు చేస్తూ దాడికి పాల్పడ్డారని బాధితులు ఆరోపిస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని మళ్లీ వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. బాధితులు ఆత్కూరు పోలీస్ స్టేషన్ ఎదుట భారీ నిరసనకు దిగారు.