SKLM: భారీ వర్షాల నేపథ్యంలో సంతబొమ్మాలి, పోలాకి మండలాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ బుధవారం తనిఖీ చేశారు. కారిపేట, మూలపేట ప్రాంతాల్లో పర్యటించి కేంద్రాల్లోని మౌలిక వసతులను పరిశీలించారు. తాగునీరు, ఆహారం, విద్యుత్, పారిశుధ్యం వంటి సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
పునరావాస కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్


