SKLM: వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు సోంపేట మండలం బారువ ఏటిబట్టి, కవిటి, పాలగడ్డ ప్రాంతాల్లో వరి పొలాలు నీట మునిగాయి. ఎగువ నుంచి అధికంగా నీరు చేరడంతో పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితమే నాట్లు వేసిన పంట ముంపునకు గురికావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
చెరువులను తలపిస్తున్న పంట పొలాలు


