హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గృహ నిర్మాణాల ప్రగతిపై ఎమ్మెల్యే సమీక్ష

AKP: ఎలమంచిలి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ హౌసింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో ఇళ్ల నిర్మాణాల పురోగతి, లబ్ధిదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.