హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అంగన్వాడీ కేంద్రానికి గ్రామస్తుల చేయూత

PLD: రొంపిచర్ల(M) గోగులపాడులో గల అంగన్వాడీ కేంద్రంలోని ప్రీ-స్కూల్ పిల్లల సౌకర్యార్థం గ్రామస్తులు రూ.20 వేల విలువైన ఇనుప ర్యాకులు, కుర్చీలు, టేబుల్‌ను సమకూర్చారు. ఐసీడీఎస్ సూపర్‌వైజర్ మరియా కుమారి, అంగన్వాడీ టీచర్ ఆదిలక్ష్మి చేతుల మీదుగా దాతలు ఈ సామగ్రిని అంగన్వాడి కేంద్రానికి అందజేశారు.