అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో అక్టోబర్‌లో జిల్లా స్థాయి యువజనోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆన్‌సెట్ సీఈఓ రవిశంకర్‌రెడ్డి తెలిపారు. 15–29 ఏళ్ల యువత జానపద నృత్యం, గీతం, పెయింటింగ్, వీధి నాటకం, కవితల పోటీల్లో పాల్గొనవచ్చు. ఆసక్తి గల వారు మై భారత్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. విజేతలకు రాష్ట్ర, జాతీయ స్థాయి అవకాశం ఉంటుంది. ఈనెల 30లోగా వివరాలు అందించాలి.
ఆంధ్రప్రదేశ్
'యువజనోత్సవాలకు దరఖాస్తుల ఆహ్వానం'


