SS: కదిరి రూరల్ మండలం ముత్యాల చెరువు పరిధిలో సామూహిక పశుగ్రాసం పెంపకాన్ని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ప్రారంభించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పశుగ్రాసం కొరత రాకుండా గడ్డి విత్తనాలు చల్లారు. పాడి రైతులకు ప్రత్యామ్నాయ పశుగ్రాస విత్తనాలను అందించారు. పశుసంపదను కాపాడేందుకు, రైతులకు అండగా నిలిచేందుకు చర్యలు కొనసాగిస్తామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పాడి రైతులకు పశుగ్రాస విత్తనాలు పంపిణీ


