హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కదిరిలో కరువు పరిస్థితులపై సమీక్ష

SS: కదిరి రూరల్ మండల అధికారులతో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ సమీక్ష నిర్వహించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీరు, సాగునీరు, పంటల పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. రైతులకు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తాగునీటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.