హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

ASR: అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున అరకు, డుంబ్రిగూడ, అనంతగిరి మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఐ ఏ. కోటేశ్వరరావు సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, వాగులు, వంకలు, చెరువుల వద్దకు వెళ్లవద్దని కోరారు. తాగునీరు, ఆహారం, మందులు సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు.