కడప జిల్లా కలసపాడు ఎస్సైగా హనుమంతు బాధ్యతలు చేపట్టారు. పోరుమామిళ్ల నుంచి బదిలీపై వచ్చిన ఆయన నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించారు. కలసపాడు మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపడతామని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కలసపాడు ఎస్సైగా హనుమంతు బాధ్యతలు స్వీకరణ


