హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నంద్యాలలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం

నంద్యాల కలెక్టరేట్‌లో ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా బుధవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కలెక్టర్ రాజకుమారి గణియా శిబిరాన్ని ప్రారంభించి హెచ్‌బీ, బోన్ డెన్సిటీ తదితర పరీక్షలు చేయించుకున్నారు. ఆయుర్వేదం మన సంప్రదాయ వైద్య విజ్ఞానంలో ముఖ్యమైన భాగమని, సాంప్రదాయ వైద్య విధానాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ సూచించారు.