హైదరాబాద్: 28°C
తెలంగాణ

నీటి సంపులో పడి బాలుడి మృతి

JGL: కొడిమ్యాల మండలం నల్లగొండలో మంగళవారం విషాద ఘటన చోటుచేసుకుంది. రామోజు గంగాచారి-హారిక దంపతుల కుమారుడు శివాన్సు (15 నెలలు) ఇంటి ముందు ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు నీటి సంపులో పడిపోయాడు. కుటుంబ సభ్యులు గుర్తించి బయటకు తీసేలోపే మృతి చెందాడు. బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు ఎస్సై నరేశ్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.