హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు ఖమ్మం అగ్రికల్చర్ మార్కెట్‌కు సెలవు..!

KMM: వినాయక నిమజ్జనం సందర్భంగా ఈ రోజు (బుధవారం) ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు ప్రకటించారు. దీంతో నేడు మార్కెట్‌లో ఎలాంటి వ్యాపార లావాదేవీలు జరగవని పాలకవర్గం స్పష్టం చేసింది. తిరిగి రేపు (సెప్టెంబర్ 24, గురువారం) నుండి మార్కెట్‌లో వ్యాపారాలు యథావిధిగా కొనసాగుతాయని బోర్డు తెలిపింది. రైతులు, వర్తకులు ఈ విషయాన్ని గమనించాలని సూచించింది.