హైదరాబాద్: 28°C
తెలంగాణ

సాగునీరు విడుదల చేయించాలని వినతి

NGKL: వంగూరు మండలంలోని వ్యవసాయ భూములకు సాగునీరు అందించాలని కోరుతూ తిప్పారెడ్డిపల్లి సర్పంచ్ ఎన్. శ్రీనివాస్ బుధవారం స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణకు వినతిపత్రం ఇచ్చారు. తిప్పారెడ్డిపల్లి, తిరుమలగిరి, కోనేటి పూర్ గ్రామాల్లో 15 వేల ఎకరాల వ్యవసాయ భూమికి తిప్పారెడ్డిపల్లిలోని పోతినేని కుంట ద్వారా సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మల్యేను ఆయన కోరారు.