హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుడుంబా కేంద్రాలపై పోలీసుల దాడులు

MHBD: కొత్తగూడ మండలం బత్తులపల్లిలో గుడుంబా కేంద్రాలపై ఎస్సై రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో బుధవారం తెల్లవారుజామున పోలీసులు దాడులు నిర్వహించారు. నాటుసారా తయారీకి సిద్ధంగా ఉంచిన బెల్లం పానకాన్ని ధ్వంసం చేసి, గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. గుడుంబా తయారు చేస్తున్న ఒక వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. గుడుంబా తయారు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.