PDPL: పెద్దపల్లి మండలంలోని మూలసాలలో పిడుగుపాటుకు 25 గొర్రెలు మృతి చెందడం బాధాకరమని ప్రభుత్వవిప్, ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. మంగళవారం ఘటనాస్థలాన్ని పరిశీలించి, బాధిత గొర్రెల కాపరులను పరామర్శించారు. బోయిని సదయ్య, కాసు నరేష్‌కు చెందిన గొర్రెలు అన్నయ్య కుంట చెరువు సమీపంలో మేతకు వెళ్లిన సమయంలో పిడుగుపాటుకు మృతి చెందినట్లు వారు తెలిపారు.
తెలంగాణ
గొర్రెల కాపరులను పరామర్శించిన ఎమ్మెల్యే


