హైదరాబాద్: 28°C
తెలంగాణ

మధ్యాహ్న భోజనం నిర్వాహకుల సమ్మె

SRCL: ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వ హిస్తున్న మధ్యాహ్న భోజన నిర్వాహకుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎగమంటి ఎల్లారెడ్డి డిమాండ్ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె మంగళవారం ప్రారంభించారు. ఆయన పాల్గొని మాట్లాడుతూ మధ్యాహ్న భోజన నిర్వాహకుల డబ్బులు ప్రభుత్వం చెల్లించకపోవడంతో అప్పులు చేసి వంటలు వండుతున్నారన్నారు.