BHPL: టేకుమట్ల మండలం పెద్దంపల్లిలో అప్పు విషయంలో జరిగిన గొడవకు సంబంధించి జక్కుల రవిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై జి. అమూల్య తెలిపారు. రూ.6 లక్షల అప్పు విషయంలో రాజయ్యను నెట్టివేయడంతో కాలికి గాయమైనట్లు తెలిపారు. బాధితుడు ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసిన పోలీసులు రవిని కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు వెల్లడించారు.
తెలంగాణ
అప్పు విషయంలో గొడవ.. నిందితుడికి రిమాండ్


