హైదరాబాద్: 28°C
తెలంగాణ

పంటలను పరిశీలించిన శాస్త్రవేత్తలు

BHPL: తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో టేకుమట్ల మండలంలోని పలు గ్రామాల్లో పత్తి, వరి, కంది, పసుపు, మిరప పంటలను శాస్త్రవేత్తల బృందం పరిశీలించింది. పురుగులు, తెగుళ్లు, పోషక లోపాలను గుర్తించారు. వాటి నివారణకు రైతులకు సూచనలు చేశారు. పత్తిలో రసంపీల్చే పురుగులు, గులాబీ రంగు కాయతొలుచు పురుగు నివారణకు సిఫార్సు చేసిన మందులను మాత్రమే వినియోగించాలని తెలిపారు.