హైదరాబాద్: 28°C
తెలంగాణ

పిడుగుపాటుకు దుక్కిటెద్దు మృతి

JN: స్టేషన్ ఘనపూర్ మండలం మీదికొండ గ్రామంలో మంగళవారం పిడుగుపాటుకు ఎద్దు మృతి చెందింది. రైతు దాండిగ నాగరాజుకు చెందిన ఎద్దు వ్యవసాయ బావి వద్ద ఉండగా పిడుగు పడటంతో మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. మృతిచెందిన ఎద్దు విలువ సుమారు రూ.75 వేలు ఉంటుందని రైతులు పేర్కొన్నారు. ప్రభుత్వ బాధిత రైతుకు నష్ట పరిహారం అందించాలని రైతులు విజ్ఞప్తి చేశారు.