MLG: వాజేడు మండలం పేరూరు గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఏటూరునాగారం ఐటీడీఏ పీవో లెనిన్ వత్సల్ టొప్పో మంగళవారం తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం, వసతులను పరిశీలించి, విద్యా బోధనపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు, సిబ్బంది విధుల్లో అందుబాటులో ఉండాలని, విద్యార్థుల విద్యా ప్రగతిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.
తెలంగాణ
పేరూరు ఆశ్రమ పాఠశాలలో ఐటీడీఏ పీవో తనిఖీ


