JN: స్టేషన్‌ఘన్‌పూర్ మండలం మీదికొండలో గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మంగళవారం రాత్రి పౌరాణిక నాటకం ప్రదర్శించారు. శ్రీ వేణుగోపాలస్వామి నాట్య కళామండలి అధ్యక్షుడు చెరుకు పాపయ్య ఆధ్వర్యంలో రామాయణంలోని ఘట్టాన్ని నాటక రూపంలో ప్రదర్శించగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇలాంటి కార్యక్రమాల ద్వారా పురాతన కళారూపాలను నేటి తరానికి పరిచయం చేయవచ్చన్నారు.
తెలంగాణ
గణేశ్ ఉత్సవాల్లో ఆకట్టుకున్న పౌరాణిక నాటకం


