SDPT: హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కట్ట వద్ద వినాయక నిమజ్జన ఏర్పాట్లను సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాళ్, అధికారులతో కలిసి పరిశీలించారు. వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పకడ్బందీ భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం చెరువు కట్ట సుందరీకరణ పనులతో పాటు రాష్ట్రంలోనే తొలిసారిగా అక్కడ నిర్మిస్తున్న గ్లాస్ బ్రిడ్జ్ పనులను సీపీ పరిశీలించారు.
తెలంగాణ
ఎల్లమ్మ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లు పరిశీలించిన సీపీ


