హైదరాబాద్: 28°C
తెలంగాణ

ముద్దుపెట్టిన సెక్యూరిటీ గార్డు.. కేసు నమోదు

RR: గచ్చిబౌలి ఇందిరానగర్‌లో క్యాబ్ ఎక్కుతున్న 24 ఏళ్ల మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను పక్కకు లాగి ముద్దు పెట్టిన జార్ఖండ్‌కు చెందిన సెక్యూరిటీ గార్డు రాజ్‌కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలు బిగ్గరగా అరవడంతో పారిపోయిన నిందితుడిని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.