HNK: హసన్‌పర్తి మండలం వంగపహాడ్‌లో నిషేధిత గుట్కా, పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తున్న కిరాణా వ్యాపారిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని దుకాణంలో రూ.13,700 విలువైన గుట్కా, పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టినట్లు సీఐ ఎ. మహేందర్ మంగళవారంతెలిపారు. నిషేధిత ఉత్పత్తుల విక్రయంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తెలంగాణ
కిరాణా దుకాణంలో గుట్కా స్వాధీనం


