హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిద్రిస్తుండగా మట్టి గోడ కూలి మహిళ మృతి

JN: లింగాలఘనపురం మండలం నాగారం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న మద్దూరి లక్ష్మి (60)పై మట్టి గోడ కూలడంతో తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. పాత ఇల్లు కావడంతో గోడ కూలినట్లు గ్రామస్థులు తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు కోసం గతంలో ప్రజావాణిలో దరఖాస్తు చేసినా మంజూరు కాలేదన్నారు.