హైదరాబాద్: 28°C
తెలంగాణ

తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ తనిఖీలు

SRPT: అర్వపల్లిలోని తహసీల్దార్ కార్యాలయాన్ని అదనపు కలెక్టర్ హరిసింగ్ మంగళవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. 'సర్' ప్రక్రియపై ఆరా తీసి రికార్డులను పరిశీలించారు. పనుల్లో పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా, వేగంగా పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా సేవలు అందించాలని తహసీల్దార్ బాషపాక శ్రీకాంత్‌ను ఆదేశించారు.