NZB: బోధన్‌లోని పసుపువాగు వద్ద గణేష్ నిమజ్జన బందోబస్తు ఏర్పాట్లను నిజామాబాద్ సీపీ సాయి చైతన్య పరిశీలించారు. నిమజ్జన ప్రదేశంలో భద్రత, ట్రాఫిక్, జనసందోహం నియంత్రణపై పోలీస్ అధికారులకు సూచనలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్, ఎస్‌హెచ్‌ఓ వెంకట్ నారాయణ పాల్గొన్నారు.
తెలంగాణ
పసుపువాగు వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై సీపీ సమీక్ష


