హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎల్లంపల్లిలో గణేశ్ నిమజ్జనం నిషేధం

MNCL: హాజీపూర్ మండలం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో గణేశ్ నిమజ్జనం నిషేధం ఉన్నట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. బుధవారం జరిగే గణేశ్ నిమజ్జనం కోసం అనుమతి ఉన్న నది, చెరువులలో చేసుకోవాలని సూచించారు. ప్రాజెక్టు నీరు తాగునీటి అవసరాలకు ఉన్నట్లు తెలిపారు. నిమజ్జన శోభ యాత్రలో డీజేలు అనుమతి లేదని, చిన్నపిల్లలను తీసుకెళ్లవద్దని సూచించారు