హైదరాబాద్: 28°C
తెలంగాణ

క్రీడాకారిణులకు రక్షణ అవగాహన సదస్సు

MDK: మెదక్ స్టేడియంలో శిక్షణ పొందుతున్న విద్యార్థినులకు షీ టీమ్స్ బృందం భద్రత, చట్టాలపై అవగాహన కల్పించింది. వేధింపులకు భయపడకుండా వెంటనే పోలీసులను సంప్రదించాలని స్పష్టం చేశారు. స్వయం రక్షణ కోసం T-SAFE యాప్, డయల్ 112 అత్యవసర సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉంటూ, క్రీడల్లో రాణించి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆకాంక్షించారు.