ADB: పట్టణంలోని విద్యానగర్ కాలనీలో నూతన జిల్లా ఆధార్ సేవా కేంద్రాన్ని అదనపు కలెక్టర్ ఆర్.ఎస్. చిత్రు మంగళవారం ప్రారంభించారు. ఈ కేంద్రం వారంలో 7 రోజులూ (ఆదివారంతో సహా) పనిచేస్తుందని తెలిపారు. రోజుకు 300-400 మంది సేవలు పొందవచ్చని, కొత్త నమోదు, బయోమెట్రిక్ అప్‌డేట్ ఉచితమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు రవి, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఆధార్ సేవా కేంద్రాన్ని ప్రారంభించిన అదనపు కలెక్టర్


