WGL: వినాయక నిమజ్జన కార్యక్రమాల నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇవాళ మద్యం దుకాణాలు మూసి వేయాలని ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. నిమజ్జన వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ప్రభుత్వ నిర్ణయం మేరకు మద్యం దుకాణాలను బంద్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. తిరిగి ఈ నెల 24న దుకాణాలు తెరవాలని సూచించారు.
తెలంగాణ
నేడు వైన్ షాపులు బంద్..!


