హైదరాబాద్: 28°C
తెలంగాణ

పిడుగుపడి రైతు మృతి

KNR: చొప్పదండి మండలం చాకుంటకి చెందిన మాజీ ఎంపీటీసీ గోపు మంగమ్మ భర్త గోపు నరేందర్ రెడ్డి పొలం వద్ద పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. చింతకుంట నుంచి వెదురుగట్ట వెళ్లే రోడ్డులోని తన పొలంలో ఉండగా ఈ ప్రమాదం జరిగింది. సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా, ఆయన మృతి చెంది ఉండడాన్ని గుర్తించి కన్నీరుమున్నీరుగా విలపించారు.