ASR: అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో డుంబ్రిగూడ మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన చాపరాయి జలపాతాన్ని నేటి నుంచి మూడు రోజుల పాటు తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు చాపరాయి మేనేజర్ అప్పారావు మంగళవారం తెలిపారు. అధికారుల సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. పర్యాటకులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
చాపరాయి జలపాతం మూసివేత


