బాపట్ల అభివృద్ధికి ప్రభుత్వం రూ. 29 కోట్లు కేటాయించడం పట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ హర్షం వ్యక్తం చేశారు. బాపట్ల మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సీఎం వర్చువల్ సమావేశ ప్రత్యక్ష ప్రసారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం కేటాయించిన ఈ నిధులతో పట్టణంలో మౌలిక వసతులు, ఇతర సంక్షేమ, అభివృద్ధి పనులను చేపడతామన్నారు.
ఆంధ్రప్రదేశ్
బాపట్లకు రూ. 29 కోట్లు కేటాయించిన సీఎం


