హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కానిస్టేబుళ్లే పోలీసు వ్యవస్థకు వెన్నెముక

GNTR: మంగళగిరిలో 149 మంది నూతన కానిస్టేబుళ్ల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రమశిక్షణ, నిజాయితీ, మానవత్వంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. పోలీసులంటే ప్రజల్లో భయం కాకుండా భరోసా కలగాలన్నారు. కానిస్టేబుళ్ల స్టైపెండ్‌ను రూ.4,500 నుంచి రూ.12,500కు పెంచుతున్నట్లు ప్రకటించారు.