MDK: రామాయంపేటలో వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా యాంటీ డ్రగ్, బాంబు స్క్వాడ్ బృందాలు మంగళవారం ప్రత్యేక తనిఖీలు చేపట్టాయి. ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాలతో ఈ తనిఖీలు నిర్వహించామని, మండపాల వద్ద అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు సూచించారు.
తెలంగాణ
మండపాల వద్ద తనిఖీలు


