HYD: యాదగిరిగుట్టపై పార్కింగ్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన భక్తుల కారు ఢీకొనడంతో దివ్యాంగ యాచకురాలు ఈశ్వరమ్మ మృతిచెందింది. ఆమె కొన్ని రోజులుగా ఆలయ పరిసరాల్లో భిక్షాటన చేస్తున్నట్లు సమాచారం. కారు రివర్స్ తీస్తుండగా ప్రమాదం జరిగినట్లు భక్తులు చెబుతున్నారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు.
తెలంగాణ
కారు ఢీకొని దివ్యాంగ యాచకురాలి మృతి


