HYD: విదేశీ ఉద్యోగాలు, వీసాలు ఇప్పిస్తామంటూ వందలాది మంది నిరుద్యోగులను మోసగించిన ఘటన బేగంపేటలో వెలుగుచూసింది. ప్రకాశ్‌నగర్‌లోని ఫ్లయింగ్ బోర్డర్స్ ఇమ్మిగ్రేషన్ కన్సల్టెన్సీ కార్యాలయం మూసివేయడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. భారీగా డబ్బులు వసూలు చేసి నకిలీ నియామకపత్రాలు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. 400 మందికిపైగా బాధితులు ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు.
తెలంగాణ
విదేశీ ఉద్యోగాల పేరుతో టోకరా


