హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గులాబీ రంగు కాయదోమ నివారణకు సమగ్ర సస్యరక్షణ

GNTR: పత్తిలో గులాబీ రంగు కాయదోమ నివారణకు రసాయనిక మందులపై మాత్రమే ఆధారపడకుండా సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించాలని గుంటూరు సహాయ వ్యవసాయ సంచాలకులు ఎన్. మోహన్‌రావు సూచించారు. ఫిరంగిపురం (మం) శిరంగిపాలెంలో నిర్వహించిన 'పొలం పిలుస్తుంది' కార్యక్రమంలో ఆయన, మండల వ్యవసాయ అధికారి వాసంతి పాల్గొన్నారు. పత్తిలో తొలిదశలో లోతుగా దుక్కులు దున్నుకోవాలని సూచించారు.