హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీవారి పూజల్లో 12 రకాల పుష్పాలు

CTR: శ్రీవారి నిత్య కైంకర్యాల్లో ప్రతిరోజూ సుమారు 300 కిలోల వివిధ రకాల పుష్పాలను వినియోగిస్తున్నట్లు టీటీడీ గార్డెన్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు తెలిపారు. నిత్య పూజల్లో 12 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలను ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా వాహన సేవల అలంకరణకు అదనంగా మరో 300 కిలోల పుష్పాలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.