హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలీస్ వేధింపులు.. డైరెక్టర్ ఆత్మహత్యాయత్నం

PLD: పిడుగురాళ్లకు చెందిన లలిత ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం హోటల్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ కిషోర్ పోలీసుల వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. స్లీపింగ్ టాబ్లెట్లు తీసుకున్న ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. తన ఆత్మహత్యకు నరసరావుపేట డీఎస్పీ హనుమంతరావు, టీడీపీ నేతలు కోటిరెడ్డి, పరుచూరి ఆంజనేయులు కారణమని సెల్ఫీ వీడియోలో ఆరోపించారు.