హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: బస్సు డ్రైవర్లకు రహదారి భద్రతపై అవగాహన

PLD: నరసరావుపేటలో ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల బస్సు డ్రైవర్లకు రహదారి భద్రతపై అవగాహన నిర్వహించారు. రవాణా శాఖ అధికారి సంజీవ్‌కుమార్ వేగ నియంత్రణ, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ.. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. డ్రైవర్లకు కంటి పరీక్షలు, ప్రథమ చికిత్స, అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. సమావేశంలో సుమారు 400 మంది డ్రైవర్లు హాజరయ్యారు.