వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌ను మంగళవారం పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఆర్‌ఐసీయూ వార్డులో పైకప్పు పెచ్చులు ఊడిపడిన విషయం తెలుసుకున్న వినయ్ భాస్కర్ ఆసుపత్రిని సందర్శించేందుకు వెళ్లగా గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీఆర్‌ఎస్ శ్రేణులు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది.
తెలంగాణ
VIDEO: 'MGMలో ఉద్రిక్తత'


