ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్‌లో వర్షపాతం సంతృప్తికరంగా నమోదైంది. ఐఎండీ తాజా గణాంకాల ప్రకారం జూన్ 1 నుంచి సెప్టెంబర్ 19 వరకు కరీంనగర్‌లో 577.8, పెద్దపల్లిలో 780.7, జగిత్యాలలో 711.7, రాజన్న సిరిసిల్లలో 666.4 మి.మీ వర్షపాతం నమోదైంది. అన్ని జిల్లాల్లోనూ వర్షపాతం సాధారణ స్థాయిలోనే కొనసాగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
తెలంగాణ
ఉమ్మడి జిల్లాలో సాధారణ వర్షపాతం


