హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'స్థానిక ఎన్నికల్లో బలిజలకు ప్రాధాన్యత ఇవ్వాలి'

సత్యసాయి: స్థానిక సంస్థల ఎన్నికల్లో బలిజలకు సముచిత ప్రాధాన్యత కల్పించాలని పుట్టపర్తి నియోజకవర్గ బలిజ సంఘం నాయకులు కోరారు. ఎన్నికల్లో తగిన ప్రాతినిధ్యంపై చర్చించేందుకు ఈనెల 23న పుట్టపర్తి సాయి ఆరామంలో ఆకుల బాలగంగాధర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించనున్నారు. కౌన్సిలర్, ఛైర్మన్ పదవుల్లో స్థానం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.